తిరుపతి ఉప ఎన్నికలో పెయిడ్ న్యూస్ ఆర్టికల్స్ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి కె. విజయానంద్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన అధికారితో పాటు స్థానిక సమాచార పౌరసంబంధాల కమిషనర్, జాయింట్ డైరెక్టర్, ఉప ఎన్నికల ప్రత్యేక అధికారి, ఇతరులను సభ్యులుగా నియమించారు.
పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకుని.. వాటిని విశ్లేషించి కమిటీ కేసులు నమోదు చేయనుంది. ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో వచ్చే చెల్లింపు వార్తలను గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్ వెల్లడించారు.
ఇదీచదవండి