ETV Bharat / city

THIRUMALA: తిరుమల బ్రహ్మోత్సవాలు.. వెనుకబడిన వర్గాలకూ శ్రీవారి దర్శనం

తిరుమల(tirumala) బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే(TTD) నిర్ణయించింది. శ్రీవారి దర్శన టికెట్లు(Tickets) ఉంటేనే తిరుమలకు అనుమతిస్తున్నట్లు తితిదే వెల్లడించింది.

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాలకూ శ్రీవారి దర్శనం

author img

By

Published : Oct 4, 2021, 6:52 PM IST

శ్రీవారి దర్శన టికెట్లు(visiting tickets) ఉంటేనే తిరుమలకు అనుమతిస్తున్నట్లు తితిదే(TTD) వెల్లడించింది. కొవిడ్ టీకా ధ్రువపత్రం, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్ సర్టిఫికెట్ ఉండాలని స్పష్టం చేసింది. చాలామంది భక్తులు దర్శన టికెట్లు లేకుండా వస్తున్నందున.. వారు అలిపిరి(alipiri) నుంచి వెనుతిరిగి పోతున్నారని తితిదే అధికారులు తెలిపారు. వీరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

వెనుకబడిన వర్గాలకూ దర్శనం...

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం(srivari visiting) కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మంది వెనుకబడిన వర్గాలకు శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే ఆలయాలు నిర్మించిన ప్రాంతాల్లోని ప్రజలకూ శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు శ్రీవారి దర్శనం కల్పించనున్న తితిదే... రోజుకు వెయ్యిమందికి ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు...

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారీ ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల దృష్ట్యా అక్టోబర్ 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మాండనాయకుని.. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవలన్నీ ఇక ఆలయ ప్రాకారానికే పరిమితం కానున్నాయి. తిరుమాఢ వీధుల్లో ఆ దేవదేవుడి వాహన సేవలు చూసి తరిద్దామనుకున్న.. భక్తులకు ఈసారీ నిరాశే మిగలనుంది.

పట్టువస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి జగన్...

ఉత్సవాల్లో భాగంగా 11న నిర్వహించే గరుడ సేవకు ముఖ్యమంత్రి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు ఈవో(eo jawahar reddy on cm jagan tirupati tour) ప్రకటించారు. సీఎం పర్యటన(cm jagan tirupati tour)లో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్నట్ల చెప్పారు. దాతల సాయంతో అలిపిరి వద్ద నిర్మించిన గోమందిరం, అలిపిరి నడక మార్గం పునః ప్రారంభంతోపాటు తిరుమలలో బూందీ తయారీ నూతన పోటును సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వివరించారు.

వ్యాక్సినేషన్ పత్రాలు తప్పనిసరి...

చిన్న పిల్లల కోసం తితిదే బర్డ్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్‌ కార్డియాక్‌ విభాగం, ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను సీఎం జగన్​ ప్రారంభించనున్నట్లు(cm jagan tirupati tour) తెలిపారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీకి టెండర్లు పూర్తయ్యాయని.. డిసెంబర్‌ నాటికి 15 రకాల ఉత్పత్తుల అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జవహర్‌ రెడ్డి వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు వ్యాక్సినేషన్​ పత్రాలతో రావాలని ఈవో సూచించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.