కార్తిక మాసంలో తితిదే నిర్వహిస్తున్న విష్ణుపూజల్లో భాగంగా.. తిరుమల వసంత మండపంలో శ్రీ రాధా దామోదర పూజ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేశారు. కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి.. ప్రార్థనా సూక్తం, మంత్ర పఠనం గావించారు.
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, ధాత్రి వృక్షానికి పూజారులు తిరువారాధన చేశారు. ధాత్రి వృక్షం(ఉసిరి) విష్ణుస్వరూపమని.. ఈ చెట్టు కింద భగవంతుడిని ప్రార్థిస్తే కోటి రెట్ల ఫలం కలుగుతుందని పండితులు తెలిపారు. విశిష్టమైన రాధా దామోదర పూజ దర్శనంతో.. వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివారికి నైవేద్యం, హారతి సమర్పించారు. క్షమా ప్రార్థన, మంగళంతో ఈ కార్యక్రమం ముగిసింది.
ఇదీ చదవండి: