ETV Bharat / city

పది నెలల తర్వాత దుకాణాలు తెరిచారు... తీరా చూస్తే..!

కరోనా వచ్చిందన్న కారణంతో.. అధికారులు దుకాణాలు మూసేయించారు. సందర్శకుల రాకనూ నిలిపేశారు. ఇదే అదనుగా.. దొంగలు చేతివాటం ప్రదర్శించారు. అందినంత దోచుకుని.. ఆ చిరువ్యాపారుల బతుకులను మరింత అగాథంలో పడేశారు. తిరుమలలో దర్శనీయ స్థలాల్లో ఉన్న ఈ పరిస్థితి.. దుకాణాదారులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.

shop-owners-facing-problems-in-tirumala
తిరుమలలో దుకాణదారుల ఇబ్బందులు
author img

By

Published : Jan 9, 2021, 12:29 PM IST

తిరుమలలో దుకాణదారుల ఇబ్బందులు

వారంతా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారం చేసేవాళ్లు. ఒక్క రోజు అంగడి తెరవకపోయినా వారి గొంతులోకి మెతుకు దిగదు. వడ్డీలకు డబ్బులు తెచ్చి.. ఆ దుకాణాల మీద పెట్టుబడి పెట్టారు. ఇంతలోనే కరోనా వచ్చి.. వారి జీవితాలను అతలాకుతులం చేసింది. అయినా తట్టుకుని బతుకుబండి నెట్టుకొచ్చారు. కొవిడ్ ప్రభావం తగ్గిన కారణంగా.. అధికారులు అనుమతించిన మేరకు.. 10 నెలల తర్వాత దుకాణాలు తెరిచేందుకు వెళ్లారు.

లోపలి వెళ్లి చూసే సరికి సరుకు అంతా దొంగల పాలైనట్టు గుర్తించి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మరికొంత సామగ్రి పాడైపోయింది. వారి గోడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియక కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇది తిరుమలలోని ఇటీవల మళ్లీ తెరుచుకున్న సందర్శనీయ స్థలాల దుకాణాదారుల దుస్థితి. వేణుగోపాలస్వామి ఆలయం, ఆకాశగంగ తదితర ప్రాంతాల్లోని దుకాణాల్లో.. దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మిగిలిన ఆ కాస్త సామగ్రి సైతం చెడిపోయింది. ఇప్పుడు పెట్టుబడికి కూడా తమకు ఆర్థిక స్థోమత లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

భారీ వర్షాలు, వరదల ప్రభావం: ఆలస్యంగా రబీ సాగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.