ETV Bharat / city

ప్రకృతితో మమేకం... పర్యటకంతో చెలిమి

అనిర్వచనీయమైన అనుభూతి, అంతులేని ఆనందం సొంతం చేసుకోవాలంటే పర్యటకాన్ని మించిన మార్గం లేదు. ముందెన్నడూ కలవని మనుషులు, పరిచయం లేని ప్రాంతాలు, ప్రకృతిలోని వైవిధ్యమైన ప్రదేశాలు మనకు చేరువ చేస్తోంది. జీవితమంటే ఉరుకులు పరుగులే కాదు... ఊహకు అందని అరుదైన అనుభవాలతో సావాసం చేయటం. ఒక ప్రణాళికా ప్రకారం వెళ్తే రోజువారీ జీవితంతో పాటు మనసుకు నచ్చిన ప్రపంచంలో విహరించవచ్చునని నిరూపిస్తున్నాడు తిరుపతి యువకుడు రూపేష్. ప్రకృతితో స్నేహం చేస్తూ...ఆహ్లాదకర జీవితం ఆస్వాదించవచ్చు అని చాటుతున్నాడు.

Rupesh  from Tirupati was excels as a moto vlogger for nature
మోటో వ్లాగర్‌గా రాణిస్తున్న తిరుపతి యువకుడు రూపేష్‌
author img

By

Published : Sep 2, 2020, 7:05 AM IST

Updated : Sep 3, 2020, 4:12 PM IST

పోటీ పేరుతో ప్రపంచమంతా పరుగులు పెడుతోంది. ఉత్తమ భవిష్యత్ సాధనలో యువతరం తీవ్రఒత్తిడి ఎదుర్కొంటుంది. సమాజంలో హోదా, నలుగురిలో గుర్తింపు కోసం చిన్నచిన్న సంతోషాలకు సైతం దూరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చిన జీవితాన్ని గడుపుతూనే...తన కెరీర్‌ను విభిన్నంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు...తిరుపతి యువకుడు రూపేష్‌. ప్రకృతితో మమేకవుతూ...ఆ అనుభవాలు ఆన్‌లైన్ ద్వారా అందరితో పంచుకుంటున్నాడు. రాయలసీమలోనే మొట్టమొదటి మోటో వ్లాగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

గెట్ యువర్ లైఫ్ బ్యాక్, గో బ్యాక్ టూ ది రూట్స్.. ఇదే మోటో వ్లాగర్ రూపేష్ నినాదం. తిరుపతిలోని బైరాగిపట్టెడకు చెందిన రూపేష్‌ విభిన్న అభిరుచితో ముందుకు సాగుతున్నాడు. మోటార్ బైక్ పై సుదూర ప్రయాణం చేస్తూ... రకరకాల ప్రదేశాలు, అక్కడి వాతావరణాన్ని అందంగా కెమెరాలో బంధిస్తున్నాడు. ప్రకృతి ప్రేమికులకు ఈ కొత్త ప్రాంతాల గురించి సమగ్ర సమాచారం అందిస్తున్నాడు.

మోటో వ్లాగర్‌గా రాణిస్తున్న తిరుపతి యువకుడు రూపేష్‌

విదేశం నుంచి స్వదేశానికి...

తిరుపతి విద్యానికేతన్‌లో బీటెక్ పూర్తి చేసిన రూపేష్...బ్రిటన్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. కరోనా వల్ల స్వదేశానికి వచ్చిన ఈ యువకుడు...అక్కడ ఉన్నప్పుడు వారాంతాలు, సెలవులు, ఖాళీ సమయాల్లో దూరప్రాంతాలకు ఒంటరిగా బైక్ పై ప్రయాణించేవాడు. ఆ అనుభవాలు వ్లోగ్ రూపంలో ప్రకృతి ప్రియులకు అందించేవాడు. అలా మోటోవ్లాగర్‌గా నెటిజన్లకు చేరువయ్యాడు.

నూతన ఆలోచనకు ప్రేరణ...

ఉన్నత చదువులకు బ్రిటన్‌ వెళ్లక ముందు రూపేష్‌ కొంతకాలం బెంగుళూరులో ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి బందీపూర్ నేషనల్ పార్క్‌కి బైక్ పై స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడి వాతావరణం, వన్యమృగాలు అతి దగ్గరగా చూడటం తనలో ఓ కొత్త ఆలోచనకు ప్రేరణనిచ్చాయి. దేశంలోని విభిన్న ప్రాంతాలను సందర్శించాలని నిర్ణయానికి వచ్చాడు. ప్రతివారం బైక్‌పై సరికొత్త ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాడు. ఆ ప్రయాణాల్లోని అనుభవాలు, స్థానిక పరిస్థితుల్ని స్నేహితులతో పంచుకునేందుకు వీడియోలు చేయటం మొదలు పెట్టాడు.

యూ ట్యూబ్ ఛానల్​తో...

రూపేష్ మించల పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు..రూపేష్‌. సందర్శిస్తున్న ప్రదేశాలు, ప్రయాణానుభవాలు యూట్యూబ్ లో పెట్టేవాడు. అలా ప్రొఫెషనల్ మోటో వ్లాగర్‌గా మారిన రూపేష్..దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటిని చుట్టివచ్చాడు. వాటిపై వీడియోలు రూపొందించాడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ప్రదేశాలతో పాటు వెలుగులోకి రాని పురాతన ప్రాంతాల సమాచారాన్ని అందిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు.

మరిచిపోలేని యాత్ర...

మహారాష్ట్ర లోనావాలాకు తిరుపతి నుంచి బైక్ పై ప్రయాణించాడు...రూపేష్‌. జీవితంలో మరిచిపోలేని యాత్రగా ఈ బైక్‌ ప్రయాణాన్ని అభివర్ణించిన ఈ కుర్రాడు...భారత్‌తో పాటు బ్రిటన్‌, ఇండోనేషియా, బాలి ద్వీపాల్లోని అందమైన పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు చేశాడు. ఎనిమిది నెలల క్రితం ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లిన రూపేష్...ఓ వైపు చదువును కొనసాగిస్తూనే...మరో వైపు మోటో వ్లాగర్ గా రాణిస్తున్నాడు...

భారతదేశమంతా బైక్‌పై ప్రయాణించటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రూపేష్‌. ఈ యాత్రలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు నుంచి ...జీవితానికి ఉపయోగపడే సరికొత్త విషయాల్ని నేర్చుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ఇదీ చూడండి: ఇతర వైద్య సేవలపై కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్​ఓ

Last Updated : Sep 3, 2020, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.