కరోనకు ముందు ఆ ప్రాంతంలో కృష్ణా, పూరి, తిరుమల, మచిలీపట్నం ఎక్సప్రెస్ రైళ్లు ఆగేవి. కరోనా అనంతరం పరిమాణాలు మారిపోయాయి. గతంలో మాదిరిగా అక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయడం లేదు. ఆ ప్రాంత ప్రజలు అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జాయంపులోని వెందొడు రైల్వే స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం పర్యటనలో వెంకటగిరి బీజేపీ కన్వీనర్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఈ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. స్పందించిన వెంకయ్య నాయుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపినట్లు ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు.
ఇవీ చదంవడి: