సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి నిర్వహిస్తామని తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. రథసప్తమి పర్వదినం ఏర్పాట్లపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్‌తో ఈవో సమీక్ష నిర్వహించారు. రథసప్తమి రోజున మలయప్పస్వామి ఏడు ప్రధాన వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై... రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయని వివరించారు. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని వెల్లడించారు.
ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై సమీక్ష
తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై తితిదే ఈవో జవహర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టాటా, టెక్ మహీంద్ర సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్రణాళికలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మ్యూజియంలోని గ్రౌండ్, మొదటి అంతస్తు, రెండో అంతస్తులను 6 జోన్లుగా విభజించి గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఈవో వారికి సూచించారు. భక్తులులోనికి ప్రవేశించగానే స్వామివారి దివ్యవైభవాన్ని వీక్షించి తరించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఇదీ చదవండి