రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 24న తిరుపతి రానున్నారు. 24 ఉదయం 9.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయల్దేరి 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని చిత్తూరు కలెక్టర్ ఎన్. భరత్ గుప్తా తెలిపారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకకోనున్నారు.
అనంతరం 12.15 నిమిషాలకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. మద్యాహ్నం 12.50 గంటలకు వరాహస్వామిని దర్శించుకొని శ్రీవారి ఆలయానికి చేరుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళతారని కలెక్టర్ తెలిపారు.
ఇదీచదవండి