తిరుమల శ్రీవారిని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, తెలంగాణ ఎమ్మెల్యే (దుబ్బాక) రఘునందన్ రావు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు.. వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
భారీ మెజార్జీతో గెలిపించాలి
తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధిని అధిక మెజార్టీతో గెలిపించాలని మార్గాని భరత్ కోరారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్పై చేసే వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ప్రభుత్వం విఫలమైంది
దుబ్బాకలో ఇళ్లు లేని ప్రజలందరికి ఇళ్లు నిర్మించేలా కృషి చేస్తాని రఘునందన్ రావు తెలిపారు. శేషాచలంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తితిదేకి వచ్చే ఆదాయంలో 10 శాతమైనా హిందూ ధర్మ ప్రచారానికి వినియోగించడం లేదన్నారు.
ఇదీ చదవండి: