వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందంటూ... తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. నగరానికి చెందిన రమేష్ రెడ్డి, కవిత... జ్వరంతో బాధపడుతున్న తమ కుమార్తెను మూడు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకొచ్చారు. డెంగీ జ్వరం ఉందని వైద్యులు తెలపగా... ఆసుపత్రిలో చేర్చారు. జ్వరం ఎక్కువై బాలికకు ఫిట్స్ వచ్చింది. మరో ఆసుపత్రికి తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు.
పాప తల్లిదండ్రులు అంబులెన్స్‌లో చెన్నైకి తీసుకెళ్లారు. చెన్నైలోని వైద్యులు పాపను పరీక్షించి... డెంగీ లేదని తెలిపారు. అధిక మోతాదులో మందులు ఇవ్వడం కారణంగా పాప మరణించిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు తిరుపతిలోని ఆసుపత్రిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాపను కోల్పోయామని ఆరోపించారు. తన తప్పిదం జరిగి ఉంటే... ఎటువంటి శిక్షకైన అర్హుడనని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :