తిరుపతి ఉపఎన్నికల్లో విజయం కోసం గ్రామీణ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పనబాక లక్ష్మీ తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తన విజయం కోసం పార్టీ శ్రేణులందరూ సమష్టిగా కృషి చేస్తారన్నారు. దుర్గరాజపట్నం ఓడరేవు, మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
గడిచిన 18 నెలల వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని.. తిరుపతి ఉపఎన్నికల్లో తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. పోరుగు రాష్ట్రంలో అధికార పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత ఇటీవల జరిగిన ఎన్నికల్లో బయటపడిందని.. అంతకుమించిన అసంతృప్తి వైకాపాపై ఉందని అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువకులు వరకు ఏ వర్గం సంతృప్తికరంగా లేదని తెలిపారు. శ్రీవారి పాదాలు, లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో పనబాక లక్ష్మితో పాటు తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'