ETV Bharat / city

ఇప్పుడు.. ఆ రెండు ప్రాజెక్టులూ ఎన్నికల ప్రచారాంశాలు..! - తిరుపతి ఉపఎన్నిక తాజా వార్తలు

ప్రారంభమైన పరిశ్రమలే కాదు, చట్టంలో పొందుపరిచినవి.. ప్రతిపాదన దశలో ఉన్నవి.. ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. ఈ కోవకు చెందినవే తిరుపతి లోక్‌సభ పరిధిలోని మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులు. సాధారణ ఎన్నికలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికలో సైతం ఈ రెండు ప్రాజెక్టులు ప్రచారాంశాలుగా మారాయి.

ఇప్పుడు.. ఆ రెండు ప్రాజెక్టులూ ఎన్నికల్లో ప్రచారాంశాలు..!

author img

By

Published : Apr 5, 2021, 7:08 PM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ప్రచారం ఊపందుకుంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. బరిలో ఉన్న ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశలో ఎన్నో అంశాలను తెరపైకి తెస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెదేపా.. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పూర్వ వైభవం కోసం అత్యంత ప్రధానమైన అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. మన్మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల సరిహద్దులో మన్నవరం సమీపంలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బెల్‌ విద్యుత్‌ ఉపకరణాల పరిశ్రమ మూతపడే దశకు చేరుకున్న తీరును ఓటర్లకు వివరిస్తోంది.

ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితోనే అవసాన దశకు చేరుకుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రెండో దశ విస్తరణ చేపట్టాల్సిన సమయంలో మన్నవరం పరిశ్రమలో ఏర్పాటు చేయాల్సిన యూనిట్లను గుజరాత్‌కు తరలించారని ఫలితంగా తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రజలకు తీరని అన్యాయం జరిగిదంటూ ఆరోపణలు చేస్తున్నారు.

మన్నవరం తరహాలోనే దుగరాజపట్నం ఓడరేపు ఎన్నికల్లో ప్రధానమైన ప్రచార అంశంగా మారింది. నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం దుగరాజపట్నం సమీపంలో ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఆరు వేల కోట్ల రూపాయలతో ఓడరేపు నిర్మాణానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2012లో ప్రతిపాదన చేసింది. 2013లో కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తదనంతర కాలంలో 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన జరగడంతో రాజధాని కోల్పోతున్న నవ్యాంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే లక్ష్యంతో దుగరాజపట్నం ఓడరేపు నిర్మాణాన్ని విభజన చట్టంలో రెండో అంశంగా పొందుపరిచారు.

రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా దుగరాజపట్నం ఓడరేపు ప్రతిపాదనల దశ దాటకపోవడంతో ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారుతోంది. ఓడరేపు కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి విపక్ష పార్టీలు.

చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మన్నవరం విద్యుత్‌ ఉపకరణాల పరిశ్రమ మూతపడే దశకు చేరడాన్ని తిరుపతి లోక్‌సభ పరిధిలోని చిత్తూరు జిల్లా మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దుగరాజపట్నం ఓడ రేపు అంశాన్ని నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తుండటంతో అధికార పార్టీ కొంత ఇబ్బంది ఎదుర్కొంటోంది.

ఇదీ చదవండి: 'నష్టాలు ఉక్కు పరిశ్రమతో కాదు.. ప్రపంచ వ్యాప్త పరిణామాలతోనే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.