ETV Bharat / city

NTR Trust Ex-Gratia: మహిళలను అవమానించడం సమాజానికి మంచిది కాదు : నారా భువనేశ్వరి - నారా భువనేశ్వరి తాజా వార్తలు

NTR Trust Ex-Gratia For Flood Victims: భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో వరద కారణంగా ప్రాణాలు విడిచిన.. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో సహాయం చేయాలి

author img

By

Published : Dec 20, 2021, 3:31 PM IST

మాట్లాడుతున్న నారా భువనేశ్వరి

NTR Trust Ex-Gratia For Flood Victims: వరదలతో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు.. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆర్థికసాయం ప్రకటించారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో.. 49 మంది మృతుల కుటుంబాలకు తిరుపతిలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ సహాయం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

ఆపద సమయంలో తాత్కాలికంగా ఆర్థిక బాధలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి సహాయం అందించామన్నారు. సమాజానికి న్యాయం చేయాలని.. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని భువనేశ్వరి చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మరవని వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ఆయన వారసత్వాన్ని తమ ట్రస్ట్‌ ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. దేశం గొప్ప విజయాలు సాధించడానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తప్పులు చేసి పాపాత్ములుగా మిగలకూడదని.. ఎల్లప్పుడూ దయ కలిగి ఇతరులకు సాయపడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదు..
ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రాజకీయాలతో సంబంధం లేదని.. ట్రస్ట్‌గా ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించడం లేదని భువనేశ్వరి చెప్పారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తమకున్న దానితోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు. ఏ మహిళనూ అవమానపరచకూడదని.. అది సమాజానికి మంచిది కాదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

CM Jagan Review on Paddy Procurement: ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.