తిరుమలలో వేకువజాము నుంచి వర్షం కురుస్తోంది. నివర్ తుఫాను ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఈ వర్షం కారణంగా ఆలయం నుంచి గదులకు చేరుకునే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది.
తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తితిదే యంత్రాంగం అప్రమత్తమైంది. కనుమ దారుల్లో భక్తులకు సూచనలు చేయడంతో పాటు... కొండచరియలు పడే పక్షంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ విభాగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: