ETV Bharat / city

THIRUMALA: తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

author img

By

Published : Aug 30, 2021, 7:51 AM IST

Updated : Aug 30, 2021, 9:54 AM IST

తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. పాలకమండలి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకోనందున.. రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే శ్రీవారి ఆలయంలో నేడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదాయబద్ధంగా వెన్న తయారు చేసి.. నవనీత సేవను ప్రారంభించారు.

thirumala
తిరుమల
తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి

తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన విధానాన్ని నిలిపివేయనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో భక్తులకు భోజనం అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపిన సుబ్బారెడ్డి.. భక్తులకు ఉచితంగా భోజనం పెట్టాలని.. అన్నప్రసాదానికి నగదును తీసుకోకూడదన్నారు. తితిదే పాలకమండలి లేని సమయంలో తీసుకున్న నిర్ణయంపై అధికారులతో చర్చించి శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా నిలిపి వేసిన ఉచిత సర్వదర్శనాన్ని అమలు చేసేందుకు చర్చిస్తామన్నారు. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వీలైనంత మందికి సర్వదర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

నవనీత సేవ ప్రారంభం...

నేడు శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని... తితిదే నవనీత సేవను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా వెన్నని సంప్రదాయబద్ధంగా తయారు చేసి స్వామివారికి సమర్పించనున్నారు. తితిదే దేశీయ ఆవుల నుంచి సేకరించిన పాలతో తయారు చేసిన పెరుగును కవ్వంతో భక్తులే చిలికి వెన్నను తయారు చేసేలా తిరుమలలోని ఎస్వీ గోశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తితిదే మాజీ బోర్డు సభ్యుడు కె.శివకుమార్‌ తెలిపారు. సాధారణంగా స్వామివారి ప్రసాదాలన్నీ తితిదే నిర్దేశించిన బ్రాహ్మణులు, స్వామివారి తల్లి వకుళామాత పర్యవేక్షణలో పోటులో తయారు చేస్తారు. ప్రస్తుతం వెన్నని మాత్రం శ్రీవారి భక్తులు స్వయంగా తయారు చేసి ఊరేగింపుగా శ్రీవారి ఆలయ తిరుమాడ వీధుల్లో తీసుకువచ్చి ఆలయం ఎదుట అర్చకులకు అప్పగించే అవకాశం భక్తులకు తితిదే కల్పించింది.

స్వామిని దర్శించుకున్న మల్కాజిగిరి ఎమ్మెల్యే

తిరుమల శ్రీవారిని తెలంగాణా రాష్ట్రం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండీ.. 'శాశ్వత ప్రాతిప‌దికన.. భ‌క్తుల‌కు సంప్రదాయ భోజనం అందిస్తాం..'

Last Updated : Aug 30, 2021, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.