తిరుపతిలో అశ్వథ్థామ చిత్ర బృందం సందడి - naga shourya ashwadhama latest news
తిరుపతిలో అశ్వథ్థామ చిత్ర బృందం సందడి చేసింది. చిత్రం విజయోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఆ చిత్రం హీరో నాగ శౌర్య, దర్శకుడు రమణతేజ... ప్రతాప్ థియేటర్ను సందర్శించారు. అభిమానులను పలకరించి హుషారెత్తించారు. తన చిత్రాన్ని ఇంతలా ఆదరించి విజయం చేకూర్చారంటూ... అభిమానులకు హీరో నాగ శౌర్య కృతజ్ఞతలు తెలిపారు.