తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి మరోమారు మానవత్వాన్ని చాటారు. కొవిడ్‌తో ఇవాళ మృతి చెందిన 15 అనాథ శవాలకు ఆయన తిరుపతి శివారుల్లో దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా కారణంగా కుటుంబం అంతా మహమ్మారి బారినపడి.. అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్నా.. అసలు తమకంటూ ఎవరూ లేకుండా మరణించిన అనాథ శవాలకు స్వయంగా పాడె మోసి... ఎమ్మెల్యే తుది వీడ్కోలు పలుకుతున్నారు.
తిరుపతి శివారులోని మామండూరు అటవీ ప్రాంతంలో కొవిడ్-19 ముస్లిం ఐకాస సభ్యులతో కలిసి భూమన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహమ్మారిని మనుషులంతా ధైర్యంగా ఎదుర్కోవాలని... ఒకవేళ ఎవరైనా కరోనాతో చనిపోతే భయపడకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకోవాలని భూమన సూచిస్తున్నారు. రెండుసార్లు కరోనా బారిన పడినా.. 64 ఏళ్ల వయస్సులో ఈ సందేశాన్ని చాటేందుకే ఇప్పటివరకూ 43 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండీ... మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స