సచివాలయంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నానితో కలిసి స్విమ్స్ పై... వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి, తిరుపతి జేఈవో బసంత్ కుమార్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రూ.24 కోట్లతో కార్డియాలజీతోపాటు గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలు అంశంపై చర్చించారు. ఉద్యోగుల పదోన్నతులు, సౌకర్యాల పెంపు తదితర అంశాలపై సమిక్షించారు. మరోవైపు స్విమ్స్‌ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'తితిదే ఉద్యోగుల కోసం మెగా వైద్య శిబిరం'