అది దేవుడైన వినాయకుని క్యాలెండర్‌ను ఆవిష్కరించే అదృష్టం రావటం ఆనందంగా ఉందని...పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేష్‌తో కలిసి 2021 సంవత్సరానికి కాణిపాకం ఆలయ కాలమాసపట్టికను మంత్రి ఆవిష్కరించారు. వరసిద్ధి వినాయక దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా బృహత్తర ప్రణాళిక పరిశీలనలో ఉందన్నారు.
భక్తులు రద్దీకి అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. కాలమాసపట్టిక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజంపేట పార్లమెంట సభ్యుడు విథున్ రెడ్డి, తంబళ్ల పల్లి శాసన సభ్యులు ద్వారకనాథ రెడ్డి పాల్గొన్నారు.