కృష్ణా జలాల సమస్యల పరిష్కారానికి ఏపీ సహకరించడం లేదని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. శనివారం తిరుమలకు వచ్చిన ఆమె ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సినీనటులు మంచు మనోజ్, మంచు లక్ష్మితో కలిసి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
‘కృష్ణా జలాల సమస్యను కేంద్రం పట్టించుకోనందునే గతంలో కోర్టును ఆశ్రయించాం. ఆ తర్వాత జరిగిన రెండు రాష్ట్రాల చర్చల్లో గోదావరి జలాలను ఏపీ వాడుకునేందుకు సహకరిస్తామని, కృష్ణా మిగులు జలాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేయడం మా ఉద్దేశమని వివరించామని, దీనిపై ఏపీ స్పందించకుండా కృష్ణాపై అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆరోపించారు.
తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కొత్త ప్రాజెక్టును అక్టోబరు నుంచి ప్రారంభించనున్నట్లు మంచు మనోజ్ తెలిపారు.
ఇదీచదవండి..