కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా ఎంపికైన నేతలంతా తమ పదవులను అలంకారప్రాయంగా భావించకుండా ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటి ఛైర్మన్, డైరెక్టర్లను నియమించడాన్ని హర్షిస్తూ తిరుపతిలో అభినందన సభ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలా మోసం చేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లాకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కానీ సీఎం జగన్ పాలనలో బీసీలను అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపుల్లోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. బీసీలంతా వైకాపాకు అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువవుతున్న తీరును కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి
అగ్రిగోల్డ్ విచారణ త్వరగా తేల్చండి... తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి