ETV Bharat / city

గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తా: పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి వార్తలు

Minister Peddireddy on illegal mining : గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిరూపిస్తే బాధ్యత వహిస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గనుల అక్రమ తవ్వకాలు జరగటం లేదని.. కావాలనే తెదేపా తమపై లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. కుప్పంలో చంద్రబాబు బినామీలే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.

పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి
author img

By

Published : Jul 14, 2022, 3:52 PM IST

Minister Peddireddy on illegal mining : రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు నిరూపిస్తే.. బాధ్యత వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రుషికొండలో అక్రమాలు జరగడం లేదని.. అనుమతులు ఉన్న ప్రాంతంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. గనుల తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయల రాయల్టీ వచ్చిందన్నారు.

కుప్పంలో చంద్రబాబు బినామీలే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో 31 గనులకు సంబంధించి తవ్వకాలు చేస్తున్నారని.. మరో 71 గనులకు వర్కింగ్ లీజులు ఉన్నాయని తెలిపారు. లీజులు అన్ని తెదేపా, కాంగ్రెస్ పాలనలో ఇచ్చారని.. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎలాంటి లీజులు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్​పై బురద చల్లడానికి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

గనుల అక్రమ తవ్వకాలు చేస్తున్నట్లు నిరూపిస్తే.. నేను బాధ్యత వహిస్తా: పెద్దిరెడ్డి

తెదేపా అధికారంలోకి రాగానే.. దోషులను కఠినంగా శిక్షిస్తాం : రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యం, పెద్దిరెడ్డి డైరెక్షన్​లోనే మైనింగ్ మాఫియా కొనసాగుతుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. జగన్‌ను అడ్డంపెట్టుకుని పెద్దిరెడ్డి ఇష్టానుసారంగా దోచేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి రాగానే దోషులకు కఠినంగా శిక్షిస్తామన్నారు. గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీలక్ష్మికి పట్టిన గతే పెద్దిరెడ్డికీ పడుతుందన్నారు. ఆధారాలు బయటపెట్టిన తర్వాత కూడా బుకాయింపులా అని నిలదీశారు. స్వామి మాల వేసుకుని కూడా పెద్దిరెడ్డి అసత్యాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీటీ కూడా కుప్పంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని నిర్థారించిందని పట్టాభి గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.