తిరుపతికి బస్సుల్లో వచ్చేవాళ్లంత దొంగ ఓట్ల కోసం వచ్చారని అనుకోవటం సరికాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో విపక్షాలు చేస్తున్న రిగ్గింగ్ ఆరోపణలను ఆయన ఖండించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారు ఎందుకు వచ్చారో తెలియకుండా విమర్శించటం.. మసిపూసి మారేడుకాయ చేయటమేనని ఎద్దేవా చేశారు. తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు నంద్యాల ఉపఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
ప్రజాస్వామబద్ధంగా జరిగిన ఎన్నికలను ఎందుకు రద్దు చేయాలని ప్రశ్నించారు. ఒకవేళ రద్దు చేసినా.. వైకాపాకేం ఇబ్బంది లేదన్నారు. తిరుపతిలో రెండు ఇళ్లు ఉన్న తాను స్థానికేతరుడిని ఎలా అవుతానంటూ ప్రశ్నించారు.
ఇదీచదవండి