తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. నియోజకవర్గ ప్రజలను కోరారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
తొండమనాడులో ఎడ్లబండిపై ఎక్కారు. వైకాపా ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైకాపాతోనే రైతుల అభివృద్ధి జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారు.
ఇదీ చదవండి: