JSP Tirupati News: సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి విఫలమైందని తిరుపతి జనసేన నాయకులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణమని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోయేలా తితిదే అధికారులు వ్యవహరిస్తున్నారని పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో తిరుమలలో చెత్త సంస్కృతి ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. వీఐపీల సేవలో తరిస్తున్న తితిదే.. సామాన్య భక్తులకు నీరు, ఆహారం ఇవ్వలేని దుస్థితికి దిగజారిందని విమర్శించారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు వంద టికెట్లు ఇచ్చే పనిలో తితిదే అధికారుల తలమునకలైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తానన్న అనిల్ కుమార్ యాదవ్.. ఒక కాలువ కూడా కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. కొత్తమంత్రుల వ్యవహార శైలి కూడా ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: