అనారోగ్య సమస్యలతో మరణించిన ఓ యాచకుడి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులు షాక్కు గుర్యయారు. ఇంట్లో ఉన్న రెండు ట్రంకు పెట్టెలను తెరిచి చూడగా.. నగదు నోట్లు కట్టలు, కట్టలుగా పడి ఉన్నాయి. యాచకుడి ఇంట్లో పెద్ద మెుత్తంలో నగదుని గుర్తించారు. నోట్ల కట్టలంటే వెయ్యో, రెండు వేలో, పది వేలో కాదు.. మొత్తం లెక్కించేందుకు ఏకంగా కౌంటింగ్ మిషన్లనే వాడారు.
తిరుమలలో నిర్వాసితుడైన శ్రీనివాసన్కు శేషాచల నగర్లో తితిదే ఇంటిని కేటాయించింది. శ్రీనివాసన్ అక్కడే ఉంటూ తిరుమలకు వచ్చే వీఐపీల వద్ద యాచనతో జీవిస్తున్నాడు. ఏడాది క్రితం అనారోగ్య సమస్యలతో శ్రీనివాసన్ మృతి చెందాడు. వారసులు లేకపోవటంతో ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు తితిదే అధికారులు శ్రీనివాసన్ నివాసానికి చేరుకున్నారు.
ఇంట్లో ఉన్న రెండు ట్రంకు పెట్టెలను తెరిచి చూసిన అధికారులు షాక్కు గురయ్యారు. పెట్టల నిండా చిల్లర నాణేలు, నోట్ల కట్టలు ఉండటంతో.. తితిదే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్ సమక్షంలో కౌంటింగ్ మెషిన్లను ఉపయోగించి డబ్బును లెక్కించారు. మెుత్తం డబ్బు రూ.6.15 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీచదవండి: ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ వ్యాధి: సీఎం జగన్