కాలినడకన తిరుమల కొండపైకి సినీ నటుడు నితిన్ - తిరుమలకు కాలినడకన హీరో నితిన్ న్యూస్
శ్రీవారి దర్శనార్థం సినీ నటుడు నితిన్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కొండపైకి చేరుకున్న నితిన్.. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నడక మార్గంలో నితిన్ ను గుర్తించిన భక్తులు.. స్వీయ చిత్రాలకు ఆసక్తి చూపారు.