ETV Bharat / city

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం..నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

author img

By

Published : Apr 23, 2021, 4:24 PM IST

Updated : Apr 24, 2021, 5:20 AM IST

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుపతిలో గంటన్నరపాటు కురిసిన వర్షానికి రహదారులు, ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

heavy rain in ap
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం

రాష్ట్రంలో అకాల వర్షం అన్నదాతను కంటతడి పెట్టించింది. శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం అక్కడక్కడ బీభత్సం సృష్టించింది. మరోవైపు అదే సమయంలో పిడుగులు పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో జీవాలు చనిపోయాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాలులు తీవ్రంగా వీచాయి. విజయవాడలోని బందరు రోడ్డులో రెండు వృక్షాలు నేలకూలి, 2 కార్లు ధ్వంసమయ్యాయి. నగరంలో విద్యుత్తు సరఫరా కొంతసేపు నిలిచిపోయింది.

అన్నదాత కుదేలు
తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షానికి చేతికొచ్చిన వరి తడిసింది. కోతలకు సిద్ధంగా ఉన్న పైరు కొన్నిచోట్ల నేలవాలగా, మరికొన్నిచోట్ల కళ్లాల్లోని ధాన్యం రాశులు తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీలో మిర్చి రైతులు నష్టపోయారు. వర్షానికి తోటల్లో కోతకొచ్చిన మిరపకాయలు రాలిపోయాయి. కోసి కళ్లాల్లో ఉంచిన మిరప తడిసి ముద్దయింది. అరటి పంటకు సైతం నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో మార్టూరు, ముండ్లమూరు, దర్శి ప్రాంతాల్లో పంట నష్టం నెలకొంది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు, చాగలమర్రి, పత్తికొండ, ఆత్మకూరు, నందికొట్కూరుల్లో భారీ గాలి వానకు మామిడి కాయలు నేలరాలాయి. మిర్చి తడిసింది. చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ విద్యుత్తు స్తంభాలు విరిగాయి. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల, దుత్తలూరు, వరికుంటపా డు మండలాల్లో మామిడి, నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి.

తిరుమల వీధులు జలమయం
తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులు, పిడుగుల శబ్దాలతో పరిసరాలు దద్దరిల్లాయి. వర్షంతో శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తు లు గదులకు చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆలయం ఎదుట, మాడ వీధులు, బయట రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
కోస్తాంధ్ర, రాయలసీమల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తామని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ ఒడిశా, పరిసరాల్లో సగటున సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

పొలాల్లోనే మృత్యువాత

జీవాలతో పొలాల్లోకి వెళ్లిన కాపరులను, ఉపాధి కూలీని పిడుగుపాటు బలి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన కందాపు మహాలక్ష్మినాయుడు (21), బొమ్మిడి రాము (50) శుక్రవారం సాయంత్రం గొర్లు మేపేందుకు గ్రామ సమీపంలో పొలాలకు తీసుకెళ్లారు. ఇంతలో వర్షం రావటంతో గొడుగు కింద తలదాచుకోగా వారిపై పిడుగు పడి మృతి చెందారు. ఇదే మండలం చెట్టుపొదిలాం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన ఎ.నాగమణి (43) పిడుగుపాటుతో మరణించింది. కోటబొమ్మాళి మండలం రామ్మూర్తిపేట గ్రామానికి చెందిన కిల్లి అప్పన్న(75) మేకలతో వెళ్లి మృతి చెందాడు.
* కడప జిల్లా కొండాపురం మృగంపల్లె గ్రామానికి చెందిన పెద్ద కుళ్లాయప్ప(65) గురువారం రాత్రి గొర్లు మేపేందుకు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంట శివారుకు వెళ్లి పిడుగుపడి చనిపోయాడు.
* నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మైపాటివారికండ్రిక గ్రామానికి చెందిన మాలిపాటి సంపూర్ణమ్మ(45), ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం నలదళపూర్‌ గ్రామంలో పిసిపల్లి మండలం లింగన్నపాలెం వాసి యరగోర్ల మాధవ(22) పిడుగుపాటుతో మృతి చెందారు.

ఇదీచదవండి: గంగా నదిలోకి దూసుకెళ్లిన వ్యాను- 9మంది జలసమాధి

Last Updated : Apr 24, 2021, 5:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.