తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం ఏర్పాటు చేయాలని తితిదే నిర్ణయించింది. వంద కిలోల బంగారంతో బంగారు పూత రాగి రేకులు ఏర్పాటు చేయనున్నారు. జీయంగార్లు, ఆగమ సలహాదారులు, అర్చకులతో తితిదే ఈవో జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు 32 కోట్ల విలువైన వంద కిలోల బంగారాన్ని తితిదే ట్రెజరీ నుంచి తీసుకోనున్నట్లు ఈఓ తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి స్వర్ణతాపడం పనులు జరగనున్నాయి. బంగారు తాపడం పనులు 2022 మే నెలలోపు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు.
పనులు పూర్తయ్యే వరకు కల్యాణ మండపంలో బాలాలయం ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మూల మూర్తి దర్శనం ఉంటుందని ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. గోవిందరాజస్వామి కైంకర్యాలు బాలాలయంలో నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: