తిరుపతిలో గో మహాసమ్మేళనం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కంచి కామకోటి పీఠాధిపతి, యోగా గురువు రామ్‌దేవ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్‌దేవ్ బాబా.. దేశీయ ఆవుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. దేశీయ ఆవుల రక్షణకు పతంజలి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశీయ గోవుల పునరుత్పత్తి, సంరక్షణకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దమని ప్రకటించారు.
ఆయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని అనుకున్నామా..? అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం ఖాయమని పేర్కొన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సాధువులంతా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సీఎం జగన్ కోరాలన్న ఆయన.. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు స్వామీజీలందరూ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: