నామినేషన్ను ఉపసంహరించుకోలేదనే కోపంతోనే తమ కార్పొరేటర్ అభ్యర్థి దుకాణంపై అధికార పార్టీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులతో దాడులు చేయించి, దుకాణాన్ని కూల్చి వేయించారని మాజీఎమ్మెల్యే, తెదేపా నేత సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణం కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించిన మాజీఎమ్మెల్యే.. అభ్యర్థికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేంచే చర్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సుగుణమ్మ తెలిపారు.
ఇదీ చదవండి: చెట్టును ఢీకొన్న మినీ ట్రక్కు... 10 మందికి గాయాలు