రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని అన్నారు. ప్రతి అమావాస్యకు తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సీఐడీ కేసు ఎందుకు పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిరుపతిపై సీఎం అంతరంగాన్ని మీడియాకు చూపితే కేసులు నమోదు చేస్తారా అని నిలదీశారు. మార్ఫింగ్ చేశానని తప్పుడు కేసులు బనాయిస్తారా అని ఆక్షేపించారు. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు.
వివేకాది గుండెపోటు అన్న విజయసాయిరెడ్డిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను తాకట్టు పెట్టారని.. జలాలపై ఉన్న రాష్ట్ర హక్కులను వదిలేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి