ETV Bharat / city

వానొస్తే చెరువే.. నడవాలంటే నరకమే

వరదనీరు అక్కడక్కడా గుంతల్లో నిలిస్తే.. సర్దుకుపోవచ్చేమో..! కానీ.. అక్కడే వీధుల నిండా వర్షపు నీరు..అదనంగా చాలాచోట్ల మురికిమయం..! వాన కురిస్తే.. విధులకు వెళ్లడమూ కష్టమే..! తిరుపతిలో ఇటీవలి వర్షాలతో...రోడ్ల పరిస్థితి, ప్రజల ఇబ్బందులపై ప్రత్యేక కథనం.

drainage water enter into the houses in tirupathi

author img

By

Published : Nov 5, 2021, 2:02 PM IST

వానోస్తే వీధులన్నీ మురికికూపాలే.. నడకా నరకప్రాయమే!

తిరుపతిలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వర్షం వచ్చిదంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం గగనమవుతోంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో..ఇళ్లలోకి నీరు చేరుతోంది. మధురానగర్, లక్ష్మీపురం కూడలి, లీలామహల్ కూడలి, ఏఐఆర్​ బైపాస్ రోడ్డు, అన్నపూర్ణ గుడి.. ఇలా ఏ ప్రాంతానికా ప్రాంతం.. నీటితో నిండిపోతోంది. ఇదిగో ఇలా.. ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు.

కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. అధికారులు స్పందించట్లేదు. కనీసం కార్యాలయానికి వెళ్లే పరిస్థితి కాదు కదా.. ఇంటి నుంచి కాలు తీసి బయట పెట్టే అవకాశం కూడా లేదు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రం అది చేస్తాం... ఇది చేస్తాం అని వస్తారు. తర్వాత ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి సమయంలో వస్తే కదా.. మా కష్టాలు తెలిసేది! - బాధితులు

మధురానగర్‌లో 40 లక్షలతో మురికినీటి కాలువ నిర్మిస్తున్న నగరపాలక అధికారులు.. వరద నీరు వదలడానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ఇళ్లలోకి చేరుతోందని.. ప్రజలు వాపోతున్నారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించాం. శాశ్వత పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మధురానగర్​లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాం. వర్షాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయి. త్వరలోనే పనులు పూర్తవుతాయి. -గిరీషా, కమిషనర్‌ తిరుపతి నగరపాలక సంస్థ.

లోతట్టు ప్రాంతాల్లో సమస్యకు శాశ్వత పరిష్కారానికి చేర్యలు చేపట్టామని.. నగరపాలక అధికారులు తెలిపారు. నిర్మాణాలు త్వరలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

MLA ROJA: అన్నతో కలిసి వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.