ప్రజా సంక్షేమంటే ఏంటో తెలియని చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు మండలాల్లో బిటి రోడ్డు మేళా ప్రారంభించారు. శ్రీరంగరాజపురం మండలంలో 45 కొత్తపల్లి గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కొటార్లపల్లె మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వారు మాట్లాడారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసింది శూన్యమని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి విమర్శించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
గంగాధర నెల్లూరు నియోజక వర్గాన్ని తనదిగా భావించి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. వైకాాపా ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి పనులను చంద్రబాబు అడ్డుకోవాలని చూడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. గతంలో జిల్లాలో ఇద్దరు మంత్రులు అధికారంలో కొనసాగినప్పటికీ చేసింది శూన్యమని అన్నారు.
ఇదీ చదవండి: RRR: 'విజయసాయిరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలి'