తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు విచారించింది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, ఉప ఎన్నికను రద్దు చేయాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాలపై విచారించిన న్యాయస్థానం..ఎలక్షన్ కమిషన్‌లో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. అక్రమాలు జరిగాయని ఆధారాలున్నా..ఎలక్షన్ కమిషన్ పిటిషన్‌కు అవకాశం ఉన్న సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమన్న న్యాయస్థానం వ్యాజ్యాలను కొట్టేసింది.
రాష్ట్రంలో పరిషత్తు ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన, తెదేపా పిటిషన్లపై న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి