ETV Bharat / city

ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో తితిదే ఈఓ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. భక్తుల సందేహాలకు సమాధానం తెలిపారు. వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

dial your eo event in ttd Chittoor district

author img

By

Published : Dec 12, 2020, 2:09 PM IST

వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. నేరుగా వచ్చే భక్తులకు ఈ నెల 24 నుంచి రోజుకు పది వేల చొప్పున లక్ష సర్వదర్శనం టికెట్లను తిరుపతిలోనే జారీ చేస్తామని ప్రకటించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్‌ యువర్‌ ఈఓ కార్యక్రమంలో భాగంగా ఫోన్‌ ద్వారా భక్తులు వ్యక్తం చేసిన సందేహాలు, సమస్యలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో పదేళ్లలోపు, 65 సంవత్సరాలు పైబడి భక్తులపై విధించిన ఆంక్షలను తొలగించి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

తెదేపా 'చలో తంబళ్లపల్లె': ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.