ETV Bharat / city

ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే జరగనున్నాయి. కొవిడ్ క్రమంలో తితిదే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 16 నుంచి 24 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

author img

By

Published : Oct 13, 2020, 10:01 AM IST

Updated : Oct 13, 2020, 12:38 PM IST

devotees wont allowed to tirumala navarathri bramhotsav
ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే ఈఓ జవహర్‌రెడ్డి ప్రకటించారు. గత నెలలో నిర్వహించిన సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి ఉత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామన్నారు. జిల్లా యంత్రాంగం, తితిదే ఉన్నతాధికారులతో బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు దపాలు చర్చించిన తర్వాత ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈఓ తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్‌లాక్‌-5 ఆదేశాలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉండటంతో ఏకాంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దర్శన టికెట్లు పెంచే ఆలోచన లేదని.. ఇప్పటికే పదహారు వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని ఈఓ తెలిపారు.

ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'

Last Updated : Oct 13, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.