కార్తీక మాసంలో తితిదే తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా వసంత మండపంలో ధాత్రివిష్ణు పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని, శ్రీ ధాత్రి (నెల్లికాయ) వృక్షాన్ని వసంత మండపానికి వేంచేపు చేశారు. అక్కడ ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కోసం పూజలు చేశారు. అనంతరం ధాత్రి వృక్షానికి ప్రత్యేక పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన నిర్వహించి... మంగళంతో పూజను ముగించారు.
ధాత్రి అంటే లక్ష్మీ నారాయణుల రూపమని... కార్తీక మాసంలో ధాత్రిని పూజించడం వల్ల సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని... వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు తెలిపారు. తద్వారా సంవత్సర కాలం సర్వదోషాలు తొలగి, నిత్యం గంగా స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఉసిరి చెట్టు కింద ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే... కోటి మందికి అన్నదానం చేసినా ఫలితం వస్తుందన్నారు. ఉసిరి, తులసీ రెండు కలిపిన జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే జన్మ జన్మల పాపం నశించి... మనోవాంచలు నెరవేరుతాయన్నారు.
ఇదీ చదవండి: