స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్... సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తిరుపతిలో నిర్వహించిన ఏఐటీయూసీ శతవసంతాల వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు.
భాజపా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. అసలు కేంద్రం అడకుండానే వ్యవసాయ బిల్లులకు వైకాపా ప్రభుత్వం మద్దతిచ్చిందని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ మీటర్ల ఏర్పాటుతో కర్షకులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. తొలుత రైల్వే స్టేషన్ వద్ద వీధి విక్రయదారులను ఉద్దేశించి నారాయణ మాట్లాడారు. వీధి విక్రయదారుల చట్టంపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని విమర్శించారు. అనతరం నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి