ETV Bharat / city

ఆ 40 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేరు..! - Closed school at chittoor

సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఉన్న పాఠశాలలే మూతపడుతున్నాయి. కార్పొరేట్‌ తరహాలో బడులను తీర్చిదిద్దేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు.. జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి తదితర పథకాలు విద్యార్థులకు ఆసరాగా ఉన్నా పిల్లల సంఖ్య గణనీయంగా పెరగలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నా జిల్లాలో ఒక్క విద్యార్థి సైతం లేని పాఠశాలలు 40 ఉన్నాయి.

None of the students at 40 places
మూతబడిన పాఠశాల
author img

By

Published : Oct 30, 2020, 7:06 PM IST

సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతున్నా విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు. ఉన్న పాఠశాలలే మూతపడుతున్నాయి. కార్పొరేట్‌ తరహాలో బడులను తీర్చిదిద్దేందుకు మనబడి నాడు-నేడు కార్యక్రమం చేపట్టారు.. జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా వసతి తదితర పథకాలు విద్యార్థులకు ఆసరాగా ఉన్నా పిల్లల సంఖ్య గణనీయంగా పెరగలేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. పలు సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నా జిల్లాలో ఒక్క విద్యార్థి సైతం లేని పాఠశాలలు 40 ఉన్నాయి. వీటిని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 53 ప్రకారం పాఠశాలల హేతుబద్ధీకరణ ముగింపు దశలో ఉంది. జిల్లా విద్యాశాఖ పాఠశాలలు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌లో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 21నుంచి నెలాఖరు లోపు సర్దుబాటు పూర్తికావాల్సి ఉంది. అయితే అధికారులు కూడికలు తీసివేతలు చేపట్టారు. దీంతో జిల్లాలో హేతుబద్ధీకరణలో ఎవరు ఎటు బదిలీ అవుతారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నవంబరు ఒకటో తేదీ నాటికి విద్యార్థులు ఎంతమంది పాఠశాలల్లో ప్రవేశిస్తారో.. వీటి ఆధారంగా టీచర్ల పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయనుంది.

పాఠశాలల పరిస్థితి ఇలా..:

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొదట ఈ ఏడాది నవంబరు రెండో తేదీ నాటికి పాఠశాల యూడైస్‌ ప్రకారం విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఈ లెక్కన విద్యార్థుల సంఖ్యతో ఆ పాఠ శాలల్లో ఉపాధ్యాయుల నియామకం ద్వారా ఆయా పాఠశాలల భవిష్యత్తు ఆధారపడి ఉంది. జిల్లా వ్యాప్తంగా 5,494 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,674 ప్రాథమిక పాఠశాలలు. ఒక్క విద్యార్థి సైతం లేని ప్రాథమిక పాఠశాలలు వీటిలో 40 ఉన్నాయి. ఐదుగురు పిల్లలు ఉన్నవి 90 ఉండగా.. పదిమంది విద్యార్థులు లోపు ఉన్న పాఠశాలలు 220 ఉన్నాయి.

ఒకరికి ఇద్దరు.. 60కి ఇద్దరే..!:

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏకోపాధ్యాయుడు లేని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రతి పాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లను తప్పనిసరిగా నియమించనున్నారు. అయితే జిల్లాలో ఒకరిద్దరు విద్యార్థులు ఉన్నా ఆ పాఠశాలకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉంటారు. 60మంది ఉన్నా ఇద్దరినే బోధనకు నియమిస్తారు. ఇక ఉన్నత పాఠశాలల్లో 20మంది విద్యార్థులు ఉన్నచోట ప్రధానోపాధ్యాయుడితో పాటు పీఈటీ, ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఉంటారు. 200మంది లోపు పిల్లలు ఉన్న ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే వర్తిస్తుంది. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయో లెక్క తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి:

స్టీలు పరిశ్రమకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.