తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు.. కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. నటి కీర్తి సురేష్ స్వామి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
2020 సంవత్సరం లాంటి రోజులు ఎన్నడూ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు మోహన్‌బాబు తెలిపారు. తాను నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రం ఫిబ్రవరిలో విడుదలవుతుందన్నారు. నటులను చూసిన యాత్రికులు వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబర్చారు.
ఇదీ చదవండి: