ETV Bharat / city

చిత్తూరు జిల్లాలో 4 రోజులుగా నమోదు కాని పాజిటివ్ కేసులు - చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య

జిల్లాలోని అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదైన తిరుపతితో పాటు పాజిటివ్ కేసులు ఉన్న ఏడు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. మూడు కిలోమీటర్ల మేర కంటైన్​మెంట్​ క్లస్టర్లు, ఐదు కిలోమీటర్ల మేర బఫర్‌జోన్‌గా ప్రభుత్వం గుర్తించి పారిశుద్ద్య కార్యక్రమాలు విస్తృతం చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలో వరుసగా నాలుగో రోజూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

chittoor-district-lock-down
chittoor-district-lock-down
author img

By

Published : Apr 12, 2020, 11:34 AM IST

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు తిరుపతిలో ఆరు, నగరిలో నాలుగు, పలమనేరులో మూడు, శ్రీకాళహస్తిలో రెండు, రేణిగుంటలో రెండు, ఏర్పేడు, నిండ్రలో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నమోదైన 19 కరోనా పాజిటివ్ కేసుల్లో రుయా ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతుండగా..పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిలో 10మంది వైద్యసేవలు అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఆసుపత్రిని కోవిడ్‌-19 జిల్లా ఆసుపత్రిగా ప్రకటించారు. దీంతో చిత్తూరు పరిసర ప్రాంతాల్లో నమోదయ్యే కరోనా పాజిటివ్‌ కేసులకు అక్కడే చికిత్స అందించడానికి వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 940 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించి నమూనాలు సేకరించగా 643 నమూనాలు నెగిటివ్​గా వచ్చాయి. మరో 277 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు.

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14 క్వారంటైన్‌ కేంద్రాలతో పాటు హోం క్వారంటైన్‌లో 305 మంది ఉన్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కోసం.. ప్రత్యేకంగా వసతిగృహాలు ఏర్పాటు చేయనున్నారు. తితిదే పరిధిలోని మాధవం వసతి గృహంలో వైద్యులు, ఇతర సిబ్బందికి వసతి ఏర్పాటు చేయనున్నారు.

ఇవీ చదవండి: వెళ్లలేరు.. ఉండలేరు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.