తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. అదనపు ఈవో నివాస ప్రాంగణం వద్ద గురువారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడే ఉన్న ఉద్యానవనంలో తిష్ఠ వేసింది. అటవీ సిబ్బంది అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన చిరుత.. అడవిలోకి పారిపోయింది. భక్తులుండే కాటేజీల వద్ద చిరుత సంచరిస్తుందన్న వార్త అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చదవండి: RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం