ETV Bharat / city

ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే నా సైన్యం: చంద్రబాబు - Tirupathi by elections news

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా అధినేత చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త కొదమ సింహంలా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో ధరలు, అవినీతి తగ్గాలంటే తెదేపా విజయం తప్పనిసరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Apr 9, 2021, 3:46 PM IST

Updated : Apr 9, 2021, 4:51 PM IST

రాష్ట్రంలో అవినీతి, ధరలు తగ్గాలంటే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో తెదేపా విజయం సాధించాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రచారానికి బయలుదేరే ముందు శ్రీకాళహస్తిలోని తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాలు రాత్రింబవళ్ళు శ్రమించి రాష్ట్ర అభివృద్ధి చేస్తే.. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా.. వైకాపా రాష్ట్ర ప్రజలపై పిడుగులు కురిపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

ప్రతి కార్యకర్త కొదమ సింహంలా పని చేయాలని సూచించారు. వైకాపా అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తూ.. పనిచేస్తున్న నేతలను గుర్తుంచుకొని సత్కరిస్తానని హామీ ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికల బరిలో తెదేపా లేనప్పటికీ వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే తన సైన్యమని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలు మితిమీరాయని విమర్శించారు. పరిశ్రమలు, ఇసుక చివరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూడా వైకాపా నేతలు అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

అనంతరం ఇటీవల మృతి చెందిన తెదేపా సీనియర్ నేత గురవయ్య నాయుడు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: భాజపా నేత లక్ష్మణ్‌

Last Updated : Apr 9, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.