తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయం కోసం కాంగ్రెస్ ధర్మయుద్ధం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతి నాలుగు కాళ్ల మండపం నుంచి కృష్ణాపురం ఠాణా వరకూ ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రాలను పంచిపెడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
అటు భాజపా ఇటు వైకాపా రెండు పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నాయన్న చింతామోహన్.. జరుగుతున్న వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇచ్చి అభివృద్ధి కోసం తిరుపతి వాసులు నిలబడాలన్నారు.
ఇదీ చదవండి: