ఏపీలో భాజపా అధికారంలోకి వస్తే.. రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేస్తామని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా.. తిరుపతిలోని ప్రముఖులతో పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో.. అధికారం అండతో వైకాపా విజయం సాధించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు.
తిరుపతిలో రాష్ట్ర ప్రభుత్వం సాక్షిగా మతమార్పిడులు జరుగుతున్నాయని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. నగరం నుంచి భాజపా అభ్యర్థి విజయం సాధిస్తే.. వాటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదు: సుజనా చౌదరి