తిరుపతి ఎస్వీబీసీ కార్యాలయ ఉద్యోగి ఓ భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింక్ పంపిన వివాదంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన.....స్వామి వారి సేవలో తరించాల్సిన ఉద్యోగులు ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు.
ఎస్వీబీసీ ఉద్యోగుల ఎంపికలోనే లోపాలున్నాయన్న ఆయన.....దేవస్థానం ఛానల్ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ఎస్వీబీసీ ఉద్యోగ వ్యవస్థను ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి
శ్రీవారి దర్శనానికి టికెట్ బుక్చేసుకుని మరీ మానేస్తున్నారు..!