తిరుపతి ఉపఎన్నికకు భాజపా-జనసేన ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల ముఖ్యనేతలు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్, జీవీఎల్ పాల్గొన్నారు. తితిదేను ధర్మాచార్యుల పర్యవేక్షణలోకి తెస్తామని భాజపా ప్రకటించింది. తిరుమలలో అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేస్తామని.. శరభయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపింది. మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
రూ.48 కోట్లతో భక్త కన్నప్ప పేరు మీద ఏకలవ్య పాఠశాల ఏర్పాటుతోపాటు ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరాకు 'జలమే జీవనం' పథకం తీసుకువస్తామని మేనిఫెస్టోలో వివరించింది. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు, రూ.2 లక్షల రుణ సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. పాడి, గొర్రెల రైతులకు కిసాన్ క్రెడిట్ ద్వారా రుణాలు, పులికాట్ సరస్సులో పూడికతీత పనులు, తిరుపతి లోక్‌సభ పరిధిలో కొత్త బోధనాసుపత్రి ఏర్పాటు వంటి అంశాలను చేర్చారు.
ఇదీ చదవండి
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఘర్షణ: 12మంది విద్యార్థులు సస్పెన్షన్