ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక: డిజిటల్ వ్యూహంలో భాజపా దూకుడు

author img

By

Published : Mar 30, 2021, 4:07 AM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఒక్కో పార్టీ.. ఒక్కో వ్యూహంతో దూసుకెళ్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్ల పర్వాన్ని పూర్తి చేసుకుని ప్రచారజోరు చూపిస్తున్న వేళ కమళ దళం డిజిటల్ వ్యూహాన్నీ అనుసరిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. తిరుపతి లోక్‌సభ పరిధిలో చేసిన ప్రగతి పనులను ట్వీట్ల రూపంలో విసురుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

tirupati by election 2021
తిరుపతి ఉప ఎన్నిక

#మోదీ4తిరుపతి... ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకే రోజు 8 వేలకు పైగా ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్‌తో నమోదు కావటంతో.. ఈ నినాదం ట్రెండింగ్ అవుతోంది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలైన వైకాపా, తెదేపా, కాంగ్రెస్, వామపక్షాలు ప్రచార జోరు పెంచుతుంటే.. సుదీర్ఘ చర్చల ద్వారా తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు జనసేనను ఒప్పించిన భారతీయ జనతా పార్టీ.. డిజిటల్ వ్యూహాన్ని రచిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా..స్పెషల్ ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి ఎన్ని నిధులను కేటాయించామనే అంశంపై ఇప్పటికే ఓ వీడియోను విడుదల చేసిన కమలదళం.. తాజాగా ట్విట్టర్ వేదికగా జోరు చూపిస్తోంది. పార్టీ రాష్ట్ర అధికారిక ఖాతాలతో పాటు, భాజపా అగ్రనాయకులు సైతం తమ ట్వీట్లతో కేంద్ర ప్రగతి పనులను విశదీకరిస్తూ '#మోదీ4తిరుపతి' అనే నినాదాన్ని వైరల్ చేస్తున్నారు.

జాతీయస్థాయి విద్యాసంస్థలైన .. ఐఐటీ తిరుపతి, ఐసర్‌తో పాటు ఎలక్ట్రానిక్ మ్యాను ఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల ఏర్పాటు, రైల్వే మార్గాల అభివృద్ధి మొదలైన అంశాల్లో తిరుపతికి కేటాయించిన నిధులపై వరుస ట్వీట్లు చేస్తున్నారు. చేసిన పనులను వివరించటంతో పాటు, చేయబోయే ప్రణాళికలను సైతం చెబుతూ డిజిటల్ ప్రచారానికి తెరలేపారు. భాజపా రాష్ట్ర అధికారిక ఖాతాతో పాటు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఇలా ఏ నాయకుడి ఖాతా చూసినా #మోదీ4తిరుపతి హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తూ సాంకేతిక సాయంతో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

భాజపా-జనసేన వ్యూహాల్ని అంతర్జాల వేదికగా విమర్శిస్తున్న వారికీ భాజపా బృందం దీటుగానే సమాధానాలిస్తోంది. పవన్ కల్యాణ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ .. వైకాపా నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అందుకు స్పందిస్తూ.. సోము వీర్రాజు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఇప్పటికే భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ దాఖలు చేయగా.. మంగళవారం నుంచి పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగనున్నారు. మరోవైపు ఇలా డిజిటల్ ప్రచారం ద్వారా..ఓటర్లను ఆకర్షించాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇదీ చదవండి

'వకీల్​సాబ్​' ట్రైలర్​ వచ్చేసిందోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.