డీఆర్డీవో అభివృద్ధి చేసిన పర్యావరణహితమైన సంచుల(biodegradable bags) విక్రయ కేంద్రాన్ని తిరుమలలో తితిదే ప్రారంభించింది. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా డీఆర్డీవో అందుబాటులోకి తెచ్చిన సంచుల విక్రయం తొలుత తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రారంభించారు. శ్రీవారి భక్తులు.. లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లేందుకు వీలుగా సంచుల విక్రయం ప్రారంభించారు. బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయ కౌంటర్‌ను తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి డీఅర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించారు.
ఐదు లడ్డూలు పట్టే సంచి ధర రూ. 2,.. 10 లడ్డూలు పట్టే సంచి రూ. 5గా నిర్ణయించారు. పర్యావరణహితమైన ఈ సంచులను జంతువులు తిన్నా ఏలాంటి హానీ ఉండదని డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. మూడు నెలల్లో భూమిలో కలసిపోయోలా ఈ సంచులను తయారు చేసినట్లు సతీశ్ రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి..